తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పుష్పంగా ‘తంగేడు పువ్వు’ను ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. అడవిలో దొరికే తంగేడు పువ్వును బతుకమ్మ పేర్చడంలో వాడుతారు. రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును ప్రభుత్వం ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్రంలో దసరా పండగ రోజు జమ్మి చెట్టు ఆకును బందువులకు, ఫ్రెండ్స్ కి ఇచ్చి విషెస్ చెప్పుకుంటారు.
0 comments :
Post a Comment